ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. గతంలో కన్వర్ట్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రాచీన దేవాలయాలను దెబ్బతీశారన్నారు. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్ క్రిస్టియన్ను టీటీడీ చైర్మన్ గా చేశారన్నారు. జగన్ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. మాంసం, మందు కూడా కొడపైకి తరలించారని ఫైర్ అయ్యారు.
ఇవ్వన్నీ గమనించాకే ఏపీ ప్రజలు జగన్ పాలనలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించి ఓడించారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తిరుమలలో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారని గుర్తు చేశారు. తిరుమలలో ఎలా అయితే ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పారో.. అలాగే శ్రీశైలంలో కూడా హిందూ ధర్మ వ్యతిరేకుల రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్నే ప్రచారం చేసేలా చూడాలన్నారు.