తెలంగాణ వీణ/ఓయూ: దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు నిరసన చేస్తున్న నేపథ్యంలో ఎన్ టి ఏ అధికారులు మరియు కేంద్రప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలి. ఈ అవకతవకల విషయములో నైపుణ్యం గల అధికారులతో కమిటినీ ఏర్పాటు చేసి వస్తవాస్తవాలను విద్యార్థులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలి..
దాదాపు ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఎంబిబిఎస్ లో సీట్ పొందడానికి నీట్ పరీక్ష 24 లక్షలకు పైగా విద్యార్థులు అప్లై చేస్తే 20 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు . నీట్ పరీక్షలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మంది విద్యార్థులకు పూర్తి మార్కులు రావడం జరిగిందీ.ఇలా రావడం ఆసాధ్యం అని చాలా మంది నిపుణులు మరియు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే చతిస్గడ్ రాష్ట్రంలో ఒకే సెంటర్ లో 6 మంది విద్యార్థులకు పూర్తి మార్కులు రావడం, మొదట జూన్14 న నీట్ ఫలితలు వెల్లడిస్తం అని ప్రకటన చేసిన ఎన్ టీ ఏ హటాత్తుగా జూన్4 న ఫలితాలు వెల్లడిచడం ఇలాంటి సంఘటనలు నీట్ పరీక్షలో అవకతవకలకు జరిగాయి అన్న విద్యార్థుల నిరసనలకు దారి తీసింది..కాబట్టి ఇప్పటికైనా ఈ విషయం పై కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిబిఐ తో ఎంక్వైరీ చెప్పించి లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.