AP: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఈవో J శ్యామలారావు తిరుమలలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆలయం, రిసెప్షన్,
అన్నప్రసాదం, ఇంజినీరింగ్ విభాగాలను తనిఖీ చేసి సమీక్షించారు. సమాజంతో తిరుమలకు భావోద్వేగ సంబంధం ఉందని ఈవో పేర్కొన్నారు. స్వామివారి
దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, సరైన సౌకర్యాలు అందించడం మన ప్రాథమిక కర్తవ్యాలు అని సిబ్బందికి మార్గనిర్దేశం
చేశారు.