తెలంగాణవీణ:ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, హిందీ నటి షబానా అజ్మీలకు ఆస్కార్ అవార్డులు అందజేసే అకాడమీలో సభ్యత్వ ఆహ్వానం అందింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపింది. ఆ జాబితాలో రాజమౌళి, షబానా అజ్మీ, రమా రాజమౌళి, రితేశ్ సిద్వానీ ఉన్నారు.