జగన్ ఇంటి దగ్గర నివాసముండే కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి జీహెచ్ఎంసి అధికారికి మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో కూల్చివేత జరిగిందని, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని ఆ అధికారిని ఈరోజు బదిలీ చేశారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రహారి కూల్చివేత గురించిన సమాచారం సాక్షాత్తు రాష్ర్ట ముఖ్యమంత్రికి కానీ పోలీస్ ఉన్నతాధికారులకు లేదని ఏకంగా సీఎంవో నుండి లీక్ ఇవ్వడం పెద్ద జోక్ అని కొట్టిపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు.
ఒకవేళ అదే నిజమైతే జగన్ ఇంటి దగ్గర నివాసముండే కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి ఎవరయ్యా అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీరిద్దరే.
ఈ ఇద్దరిలో ఎవరు జగన్ ఇంటి ప్రహరీ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్ శిష్యుడు, జగన్‌కు ఆప్తమిత్రుడు.. ఇటీవల ఎన్నికల అనంతరం సైతం జగన్ గెలుస్తారని చెప్పాడు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా మాజీ సీఎం జగన్ ఇంటి మీదకి వెళ్ళమని అధికారులను చెప్పే అంత ధైర్యం తుమ్మల నాగేశ్వరరావు చేశారా?
ఒకవేళ అదే జరిగితే సీఎంకి తెలియకుండా మంత్రులు ఇంత పని చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి చేతకానితనమే అవుతుంది.
వాస్తవానికి ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందని.. ఈ ఉందంతం వల్ల తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నుండి వ్యతిరేకత రావడంతో తనకి తెలియకుండానే ఇదంతా జరిగిందని చెప్పి ఓ అధికారిని బదిలీ చేసి దులుపుకున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.