తెలంగాణ వీణ..తెలంగాణ:జనగామ – చిల్పూర్ మండలం నునావత్ తండాలో గుగులోత్ మధు, సరిత దంపతుల కొడుకు గుగులోత్ శివరామ్(6) కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికొచ్చే సరికి ఇంట్లో బాలుడు కనిపించలేదు.. కుక్కల అరుపులు వినిపిస్తుండడంతో చెట్ల పొదల్లో చూడగా బాలుడి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు