Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రెప్పపాటులో షాకింగ్‌ ఘటన.. ఆ కండక్టర్‌ దేవుడయ్యా సామీ

Must read

తెలంగాణ వీణ,హైదరాబాద్:భూమి మీద నూకలు ఉన్నాయ్‌.. అనే మాటను మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన సందర్భాల్లో తరుచు  వాడుతూ ఉంటాం. ఇక్కడ  ఓ యువకుడికి భూమి మీద నూకలు ఉన్నాయ్‌ కాబట్టే తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డాడు.

కేరళలో ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తుండగా, కండక్టర్‌ టికెట్లు తీసుకుంటూ ఉన్నాడు.   ఆ సమయంలో సదరు యువకుడు కూడా కండక్టర్‌ పక్కనే ఉన్నాడు. యువకుడు బస్సులో నిల్చొని ఉండగా, కండక్టర్‌ సీటుకు ఆనుకుని టికెట్లు ఇస్తున్నాడు. అయితే యువకుడు ఉన్నట్టుండి పట్టు తప్పాడు.  ఆ సమయంలో బస్సు వేగంగా కదులుతూ ఉండటంతో ఆ యువకుడు కింద పడిపోయాడనే అనుకున్నారంతా.  రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో అంతా షాకయ్యారు.

కానీ ఆ కండక్టర్‌ చాకచక్యంగా వ్యవహరించి అత్యంత సమయ స్ఫూర్తితో ఆ యువకుడ్ని ఒక్క చేత్తో పట్టుకుని బస్సులోకి లాగేశాడు. అంతే క్షణం పాటు ఏమైందో తెలియని ఆ యువకుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే కండక్టర్‌ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ యువకుడు పడిపోబోతున్నాడు అనే విషయాన్ని మాత్రమే గ్రహించి చేయి అడ్డుపెట్టిన కండక్టర్‌ను అంతా కొనియాడుతున్నారు. ఆ కండక్టర్‌ దేవుడయ్యా సామీ  అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you