తెలంగాణ వీణ/ఓయూ: మాట్లాడుతూ స్వరాష్ట్ర తెలంగాణలో గత దశాబ్ద కాల కెసిఆర్ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేయడం జరిగింది.ముఖ్యంగా గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సరిపడా నిధులు కేటాయించక,కనీస మౌలిక వసతులు కల్పించక, ఉపాధ్యాయులు మరియు స్వీపర్స్ లేక ఎన్నో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో రెసిడెన్షియల్ పాఠశాలకు, దూర ప్రాంత పాఠశాలకు వెళ్లలేక,ప్రైవేటు పాఠశాలలో ఫీజుల భారం భరించలేక ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రజా పాలనలో ముఖ్యమంత్రిగా తమరి నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు నుండి మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజా శ్రేయస్సుకై, భవిష్యత్తు తరాల కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు యావత్తు విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.