తెలంగాణ వీణ : రక్తదానం మహాధానమని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కాపాడాలని మూవీ డైరెక్టర్ బాబు, సింగర్ విజయలక్ష్మి అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి జయంతి సందర్భంగా మహిత్ నారాయణ్ సహకారంతో తుర్కపల్లి గ్రామంలో ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో తల సేమియాతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తధానం చేయాలని కోరారు. తలసేమియా పిల్లల కోసం ఇలాంటి శిబిరలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. శిబిరంలో 40 మంది యువకులు, అభిమానులు రక్తధానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి యువజన సంఘం అధ్యక్షులు శ్రీధర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, ఆర్గనైజర్స్ బాబు, మల్లేష్, శ్రావణ్, రుద్ర బోయిన సాయి కిరణ్, ఆర్టిస్ట్ విజయలక్ష్మి, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ రాకేష్, గ్రామ ముఖ్యులు యూసుఫ్ బాబా, దాసరి రవి, నీరుడి అశోక్, బండి రాజేష్, మేడబోయిన నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.