తెలంగాణ వీణ..ఒడిశా:ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 147 మంది సభ్యులున్న అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుని బీజేపీ మెజారిటీ సాధించింది. అయితే రాష్ట్ర పగ్గాలు చేపట్టే నాయకుడిని పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. ఒడిశా సీనియర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి లభించిన తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను బీజేపీ నియమించింది.