Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Must read

తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట : రాజపేట మండలం రఘునాథపూర్ గ్రామంలో శ్రీదేవి భూదేవి వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు.నిర్వహకులు బీర్ల ఐలయ్య ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తాను సొంతంగా సహకరిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you