తెలంగాణవీణ, హైదారాబాద్ ; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలను పెంచాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, శ్యామ్ కుర్మాలు గురుకుల కార్యదర్శి సైదులును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గురుకుల పాఠశాలలు సక్రమంగా లేకపోవటంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 25 శాతం మాత్రమే అవకాశాలు దొరుకుతున్నాయనీ, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వెంటనే గురుకుల పాఠశాలలు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ గురుకులల్లో వర్కర్లను, టీచర్స్ ను పెంచాలనీ, పదవ తరగతి ప్రతి విద్యార్థికి ఒక ట్యాబ్ అందించాలని డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసీ సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం, గీజర్లు పడక మంచాలు, యూనిఫామ్స్ పుస్తకాలు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో నే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నగేష్ గారు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇంద్రం రజక, గణం నరసింహ కూర్మ, మట్ట భాస్కర్ గౌడ్,శశి కుమార్ పాల్గోన్నారు