తెలంగాణవీణ – కూకట్ పల్లి… కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ ,మూసాపేట డివిజన్ పరిధిలోని రామారావు నగర్, కబీర్ నగర్, పాండురంగ నగర్, స్నేహపురి కాలనీ ప్రాంతాల్లోని, పలునాలాలను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గతంలో అధిక వర్షపాతం నమోదైన సందర్భంలో ఈ నాలా పక్కన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురై , ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు, ఈ నేపథ్యంలో రమేష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నాలా పరివాహక ప్రాంతాన్ని, ఇక్కడ జరుగుతున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం నేపథ్యంలో నాలా పక్కన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, ఇక్కడ జరుగుతున్న నాలా పూడికతీత పనులను రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని, మున్సిపల్ ఎస్ ఇ చంద్రశేఖర్ రెడ్డితో రమేష్ మాట్లాడారు. రిటైనింగ్ వాల్ తోపాటు పైన స్లాబ్ వేసి పూర్తిగా మూసివేయాలని సూచించారు, లేనిపక్షంలో వర్షాకాలంలో దోమల ముసిరి ప్రజలు వ్యాదుల బారిన పడే అవకాశం ఉందన్నారు. అవసరమైన పక్షంలో నాలాల నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు బండి రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఎ బ్లాక్ ప్రెసిడెంట్ తూము వేణు, పోటీ చేసిన కార్పొరేటర్లు సయ్యద్ బాబు, గోపాల్ రెడ్డి, గోపి శెట్టి రాఘవేంద్ర, డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, సతీష్ గౌడ్ డివిజన్ నాయకులు నరసింహ యాదవ్, విఠల్ రెడ్డి, భరతమ్మ ,సీనియర్ నాయకులు ,డివిజన్ నాయకులు మారియో మహిళా నాయకురాలు పాల్గొన్నారు.