తెలంగాణ వీణ..తెలంగాణ:కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలని డిమాండ్ చేశారు. సీఎంపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్సీ వెంకట్ క్షమాపణ చెప్తానని తెలిపారు. సీఎంపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్దం అన్నారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారాలు అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.