- నేడు ఏపీ పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్
- రాధాకృష్ణన్ ను తేనీటి విందుకు ఆహ్వానించిన చంద్రబాబు
- ఉండవల్లి నివాసంలో తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన చంద్రబాబు, లోకేశ్
తెలంగాణవీణ ఆంధ్ర:తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేడు ఏపీ పర్యటనకు వచ్చారు. ఉండవల్లిలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. ఏపీ వచ్చిన తెలంగాణ గవర్నర్ ను సీఎం చంద్రబాబు ఇవాళ తేనీటి విందుకు ఆహ్వానించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న గవర్నర్ రాధాకృష్ణన్… చంద్రబాబు ఆహ్వానం మేరకు అక్కడ్నించి రోడ్డుమార్గంలో ఉండవల్లి వచ్చారు. ఆయనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయనను సత్కరించారు. అనంతరం చంద్రబాబు, రాధాకృష్ణన్ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకున్నట్టు తెలిసింది.