- హైదరాబాదులో ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు
- రామోజీకి కడసారి వీడ్కోలు పలికిన చంద్రబాబు
- ఈ సాయంత్రం ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం
- హాజరుకానున్న చంద్రబాబు
తెలంగాణ వీణ..ఆంధ్రప్రదేశ్:ఇవాళ హైదరాబాదులో రామోజీరావు అంత్యక్రియలకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు… కొద్దిసేపటికి కిందట ఢిల్లీ చేరుకున్నారు. ఈ రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరు కానున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి వచ్చే సమయంలో పలువురు నేతలు చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో జూన్ 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.