తెలంగాణ వీణ ఆంధ్ర:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు.. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.. ఈసారి ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉంటారు. పవన్ కళ్యాణ్‌కు దైవ భక్తి ఎక్కువ అని చెబుతారు.. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో.. ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు.గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు. ఆయన గతంలో చాతుర్మాస్య దీక్షను చేశారు.. నాలుగు నెలల పాటూ ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీఇజమాసం కలిపి నాలుగు నెలల పాటూ దీక్షను చేశారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్ననంత కాలం ఆహార నియమాలు పాటించేవారు.. మితంగా సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాదు పవన్ ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకునేవారు.. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్ల ఆహారంగా తీసుకునేవారు. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించేవారు.