- మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్న కేరళ సీఎం
- కేరళలో వరదలు వచ్చి అతలాకుతలమైనప్పుడు అండగా నిలిచారని వ్యాఖ్య
- వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ ఇళ్లు నిర్మించిందన్న విజయన్
తెలంగాణ వీణా..తెలంగాణ:తమ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీ రావు ఆదుకున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గుర్తు చేసుకున్నారు. రామోజీ రావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. కేరళలో వరదలు వచ్చి అతలాకుతలమైనప్పుడు అండగా నిలిచారన్నారు.వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ ఇళ్లు నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. ఉత్సకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రవేశించిన ప్రతి రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన ఎంతోమందిలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. రామోజీ రావు మరణం దేశానికి తీరని లోటు అన్నారు