- బక్రీద్ విషయంలో సందిగ్ధత
- దీనికి తెరదించుతూ 17న సెలవు ప్రకటన
- 25న ఈద్-ఇ-ఘాదిర్ సెలవు
- బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులు
తెలంగాణ వీణ ..హైదరాబాద్బ:క్రీద్ ఎప్పుడన్న విషయంలో ఈసారి కొంత గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వ సెలవు విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ సంశయానికి తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం 17ను సెలవు దినంగా ప్రకటించింది. బక్రీద్ 17 అని కొందరు, 18 అని కొందరు చెప్పడంతో ఏ రోజు నిర్వహించుకుంటే ఆ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే, తాజాగా 17ను సెలవు దినంగా ప్రకటించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. బ్యాంకులకైతే రెండో శనివారం కూడా కలిసి రావడంతో వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. అలాగే, ఈ నెల 25న ఈద్-ఇ-ఘాదిర్‌ను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది.