తెలంగాణ వీణ, జాతీయం : ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమం కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు, పార్టీ లీడర్లు, మిత్ర పక్షాల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వారణాసి చేరుకున్నారు.