తెలంగాణ వీణ, సినిమా : హీరోయిన్ శాంతి ప్రియ, హీరో జీకే వికాస్, దర్శకులు డాక్టర్ ప్రదీప్, నిర్మాత డాక్టర్.యల్వీసూర్యం సహ నిర్మాత కే.సంతోష్.కుమార్, నటులు యస్వీ సత్య ప్రసాద్ తో పాటు వంశీ టీవీ చానెల్ అధినేత డాక్టర్ వంశీ కృష్ణ మరియు డాక్టర్ మోర్డ్ శ్రీనివాస్, నటుడు, వ్యాఖ్యత మూసా ఆలీ ఖాన్, ప్రముఖ టీవీ యాంకర్ ప్రసన్న భారతి, విజయ చిత్ర ఎడిటర్ గుర్రపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అల్లంవెల్లుల్లి రెస్టారెంట్ మధురా నగర్ లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ తమ చానెల్ మరియు సినీ పత్రికల ద్వారా దర్శిని సినిమా చిట్ చాట్ తో పాటు సినిమా ప్రమోషన్ చేయడం మాకు సంతోషం గా ఉందని చెప్పారు. దర్శకులు ప్రదీప్, హీరోయిన్ శాంతి ప్రియ మాట్లాడుతూ దర్శిని సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ చిట్ చాట్ కార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ వంశీ కృష్ణ మరియు మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ రేపు జరగబోయే సంఘటన ఒక రోజు ముందు మనిషి కి తెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా ప్రజాదారణ పొంది విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 24న్యుస్ 24ప్రేమ్స్.వి.విజన్, విజయ చిత్ర మూవీ మీట్ లో భాగస్వామ్యం పంచుకున్నాయి. దర్శిని టీం చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా మరియ ప్రింట్ మీడియా కు కృతజ్ఞతలు తెలియజేశారు.