తెలంగాణ వీణ, జాతీయం : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్వాడ్స్ అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఈ మెయిల్స్ బెదిరింపు ఢిల్లీని కలవర పెడుతున్నాయి. ఇటీవలే పలు ఆస్పత్రులతో పాటు ఎయిర్‌పోర్టుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టి నకిలీదిగా తేల్చారు. తాజాగా మరోసారి బెదిరింపు పోలీసులు కంగారు పెట్టిస్తోంది. గతంలో పలు స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో పలు యాజమాన్యాలు భయాందోళనకు గురై విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. వరుస బెదిరింపులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తీహార్ జైల్లో పలువురు వీఐపీ ఖైదీలు ఉన్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలుకు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్స్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానపు వస్తువులు లభించలేదు.