తెలంగాణవీణ, యాదాద్రి : ఇటీవల యాదాద్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన గుడిలో పూజ సమయంలో డిప్యూటీ సీఎంకు సంబంధించిన ప్రోటోకాల్ సరిగ్గా చూపించలేదు. సీఎం దంపతులకు, ఇద్దు మంత్రులకు మాత్రమే పెద్ద పీట వేయగా.. డిప్యూటీ సీఎం భట్టి చిన్న కుర్చిపై కూర్చున్నారు. దీంతో యాదాద్రి ఆలయం సాక్షిగా దళిత నేత అయిన భట్టికి అవమానం చేశారని సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.దీనిపై స్పందించిన అధికారులు.. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. యాదాద్రి ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావు పై బదిలీ వేటు వేశారు. అతని స్థానంలో నూతన ఈవో గా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.