తెలంగాణవీణ, యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మో త్సవాలలో భాగంగా ఐదవ రోజు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు నరసింహుడు దర్శనమిచ్చారు.. వేద మంత్రోచ్ఛరణల మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారికి పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం పొన్నవాహన సేవపై నరసింహుడు భక్తులకు దర్శనమివ్వనున్నరు …