తెలంగాణ వీణ , సినిమా : వంద ప్రపంచ రికార్డు లను పొందిన సంస్థ నిర్వాహకులు డాక్టర్ రంజిత్ నిర్వహిస్తున్న ఆటా పాటా కవితలు డాన్స్ కోలాటం వివిధ రకాల కళా ప్రదర్శనలు చేయు మహిళలను గౌరవిస్తున్న కార్యక్రమం .అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 111మంది మహిళామూర్తులకు సన్మాన మహోత్సవం.సినిమా సీరియల్స్, లఘు చిత్రాలు, వెబ్ సిరీస్,ఓటీటీ, విద్యా, వైద్య, సేవా, కళా,నాట్య,సంగీత, సాహిత్య వివిధ రంగాల మహిళా ప్రముఖులకు మహిళా భూషణ్, మహిళా విభూషణ్ అవార్డ్స్ ప్రదానోత్సవం.సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా తెలంగాణ సారస్వత పరిషత్ లో 10మార్చ్2024న.ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సినీ నటీ నటులు, రాజకీయ నాయకులు అతిధులుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులకు మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ ధన్యవాదాలు తెలియజేశారు. మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొంటూ తెలంగాణ లో ఉన్న పేద కళాకారులకు తనవంతు సహకారం అందిస్తానని మూసా ఆలీ ఖాన్ తెలియజేశారు.