తెలంగాణ వీణ , సినిమా :ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర సందడి చేయడానికి నాలుగు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. ఆ జాబితాలో ‘తంత్ర’ .. ‘షరతులు వర్తిస్తాయి’ .. ‘ వెయ్ దరువెయ్’ .. ‘ రజాకార్’ కనిపిస్తున్నాయి. నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి వస్తున్నాయి. ‘తంత్ర’ సినిమాపై బజ్ ఎక్కువగా కనిపిస్తోంది. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాంత్రిక శక్తుల నేపథ్యంలో కొనసాగుతుంది. చైతన్యరావు – భూమి శెట్టి జంటగా ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా రూపొందింది. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిఫరెంట్ కంటెంట్ తో ఈ నెల 15వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఇక అదే రోజున, సాయిరామ్ శంకర్ హీరోగా ‘వెయ్ దరువెయ్’ థియేటర్లకు రానుంది. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, ‘యాశ’ కథానాయికగా పరిచయం కానుంది. ఈ మూడు సినిమాలతో పాటు ‘రజాకార్’ కూడా బరిలోకి దిగుతోంది. తెలంగాణ నేపథ్యంలో జరిగిన ‘రజాకార్’ సంఘటనలతో నిర్మితమైన సినిమా ఇది. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. బాబీసింహా .. వేదిక .. ప్రేమ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నాలుగు సినిమాల్లో ఏది ఎక్కువ వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.