తెలంగాణవీణ, హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్‌లో ఉన్న రవి బిస్కెట్ ఫ్యాక్టరీలో వేకువ జామున మంటలు అంటుకున్నాయి. ప్రమాదం ఎలా ఎందుకు జరిగిందో కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. చూస్తుండగానే ఫ్యాక్టరీ కాలిబూడిదైపోయింది.