Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రేపు యాదాద్రి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు (మార్చి 11) యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి యాదాద్రిలో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. సోమవారం నుంచి యాదాద్రి గుట్టపై లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు బ్రహ్మోత్సవాల తొలి రోజున జరిగే స్వస్తి పూజలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆరుగురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం పయనమవుతారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you