తెలంగాణవీణ,జాతీయం : కోచ్ జైసింహపై మహిళా క్రికెటర్లు హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని అందులో పేర్కొన్నారు. బస్సులో మద్యం తాగి తమను దూషించాడని మహిళా క్రికెటర్లు గత నెల 12న మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హెచ్‌సీఏ విచారణకు ఆదేశించింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను కోచ్ ఖండించాడు.మరోవైపు కోచ్ జైసింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ బాధ్యతల నుంచి ఆయన్ను తక్షణమే తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు తెలిపారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. వారికి హెచ్‌సీఏ అండగా ఉంటుంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం. విచారణ ముగిసే వరకూ కోచ్ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం అని జగన్మోహన్‌రావు వెల్లడించారు.