తెలంగాణ వీణ , ఉప్పల్ : పాస్టర్లకు అండగా ఉంటా అని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.మల్లాపూర్ ఎన్టీఆర్ నగర్ బండ భాయ్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పస్టర్స్ ప్రేయర్ వెల్ఫేర్ అసోసియేషన్ 5 వ వార్షకోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 5 వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మీర్పెట్ హౌసింగ్ బోర్డు కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ ,కమిటీ ప్రెసిడెంట్ తిమోతి ,సామ్యూల్ ,రంగారావు, సురేష్ పాల్, అడం రాజ్, దిద్యన్, రతనరజ్, తిమోత్, వర్తమానికులు దొడ్లవిల్సన్ , సందేశ్ తదితరులు పాల్గొన్నారు.