తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోగల ప్రాథమిక స్థాయి పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించనున్నట్లు కాంప్లెక్స్ నోడల్ అధికారి డాక్టర్ దయాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ప్రత్యేక పరీక్ష తదుపరి 1, 2 స్థానాలు సాధించిన విద్యార్థులకు కాంప్లెక్స్ తో స్థాయిలో పరీక్ష నిర్వహించబడి ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహంగా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆయా గురుకులాలు ఇతర ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలకు ఈ పరీక్షలు మాదిరిగా ఉపయోగంగా ఉంటాయని తెలిపారు.