తెలంగాణవీణ,హైదరాబాద్ : పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తో యువనటుడు సామాజిక వేత్త, నిర్మాత మూసా ఆలీ ఖాన్,మిర్యాలగూడ. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు పద్మ విభూషణ్ పురస్కారం రావడంతోచిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం తో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చిరంజీవిని కలిసే అవకాశాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. మిర్యాలగూడ నుంచి మూసా ఆలీ ఖాన్ కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది, మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ చిరంజీవిని కలిసి అభినందనలు తెలియజేశారు. మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ మెగాస్టార్అభిమానులు అన్నయ్యచిరంజీవి స్పూర్తితో భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తామని, ఈకార్యక్రమానికి మిర్యాలగూడ నుంచి ఆహ్వానించి న స్వామి నాయుడు మరియు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు మూసా ఆలీ ఖాన్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మిర్యాలగూడ నుంచి పద్మ విభూషణ్ చిరంజీవి ని కలిసిన శుభ సందర్బంగా పలువురు,పట్టణ ప్రముఖులు,కళాకారులు,చిరంజీవి అభిమానులు మూసా ఆలీ ఖాన్ నుఅభినందించారు.