తెలంగాణ వీణ, చింతలపూడి: చింతలపూడి లో జరగబోయే ప్రజలకోసం ప్రజలకొరకు ప్రజలతో కలిసి పని చేసే చంద్రన్న ‘రా కదలిరా’ సభను విజయవంతం చేయండి అని ఐటిడిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ విలేకరుల తో మాట్లాడారు
ఈరోజు మధ్యాహ్నం 2 గం. చింతలపూడి మండలంలోని ఆంథోనీ నగర్ లో జరగబోయే ‘రా కదలిరా ‘ సమావేశానికి లక్ష మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారని , సభను విజయవంతం చేసి వైసిపి ఇన్చార్జ్ కంభం విజయ రాజును డిపాజిట్ రాకుండా ఓడించి, చింతలపూడి నియోజకవర్గాన్ని అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు కి బహుమతిగా ఇవ్వాలని అనీష్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం దెందులూరులో జరిగిన సిద్ధం సభకు హాజరయ్యే ప్రతీ ఒక్కరికీ 300 నుంచి 500 రూపాయలు, ఒక క్వార్టర్ , బిర్యానీ అందించి ప్రజలను తరలించారని , అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ లో నైతికత,మానవ విలువలు,పర్యావరణ విద్య పరీక్ష రద్దుచేసి 5 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి వారి జీవితాలతో జగన్ రెడ్డి చెలగాటమాడుకుంటున్నాడని అనీష్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా జగన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వ బస్సులను, ప్రైవేట్ పాఠశాలల బస్సులను పాఠశాలల యాజమాన్యాలను, ఆర్టీసీ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి సిద్ధం సభకు వాడుకుంటున్నాడని ,ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పనులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అనీష్ అన్నారు.