తెలంగాణ వీణ, కూకట్ పల్లి : మరో రెండు మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అన్ని పార్లమెంట్ల స్థానాలలోని, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించారు, ఇందులో భాగంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ లోని కూకట్ పల్లి నియోజకవర్గానికి యూత్ కాంగ్రెస్ ఎన్నికల కోఆర్డినేటర్ గా, జిట్టా సునీల్ యాదవ్ ను తెలంగాణ యూత్ కాంగ్రెస్ కమిటీ నియమించింది.ఈ సందర్భంగా సునీల్ యాదవ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం లోని ప్రతి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసేందుకు కృషి చేస్తాననీ. తనను నియమించినదుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు, అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తాను కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గం లోని ప్రతి సీనియర్ నాయకుడిని కార్యకర్తలను పార్టీ బలోపేతం కోసం కలుపుకొని పోయే విధంగా చూస్తానన్నారు.