తెలంగాణ వీణ,కూకట్ పల్లి : కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ సర్కిల్, ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురంలో, ఇటీవల రుపాయలు 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్ ను ఏ ఈ పవన్ తో కలిసి పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో, ఫతేనగర్ డివిజన్ ను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నామని. అంతేకాక ఫతేనగర్ డివిజన్ లో కొన్ని సంవత్సరాలుగా జరగని పనులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ హయాంలో పరిష్కారానికి నోచుకున్నాయని గుర్తుచేశారు, అందులో భాగంగానే ట్రాఫిక్ నియంత్రణకు బాలానగర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించామని, బస్తిలలో రోడ్లు డ్రైయినేజీ పనులను పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కార్పొరేటర్ సతీష్ గౌడ్. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.