తెలంగాణవీణ,ఏపీ బ్యూరో : ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటీవలే డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది.. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణకు అనుమతి కోరారు పిటిషన్ తరపు న్యాయవాది.. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన.. 10 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్‌సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు.. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపించారు.. అయితే, ఈ పిటిషనర్ పై అత్యవసర విచారణ సోమవారం చేపడతామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సూచించింది.