Saturday, December 21, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బాల్క సుమన్ ను బట్టలూడదీసి కొడతాం

Must read

  • తెలంగాణకు “బూతు” నేర్పిన నేత కేసిఆర్
  • భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం

తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : ప్రజా పాలన పేరుతో రాష్ట్ర ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను కనిపిస్తే బట్టలూడదీసి కొడతామని టీపీసీసీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్, ఎస్సి సెల్ కన్వీనర్ జెబి శౌరి హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్, ఎస్సి సెల్ కన్వీనర్ జెబి శౌరి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, కొత్తగూడెం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ గడ్డం రాజశేఖర్, గరీబ్ పేట ఎంపీటీసీ కసానబోయిన భద్రం ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ లు బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అతను బాల్క సుమన్ కాదు “బాడకవ్” సుమన్ అంటూ తీవ్రంగా గద్దించారు. బాల్క సుమన్ ఏం చేసి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడో ఎలా అక్రమ ఆస్తులు సంపాదించాడో అందరికి తెలుసన్నారు. తెలంగాణకు బూతు మాటలు, పదాలు నేర్పించిన ఘనత కేసిఆర్ కె దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ఒక్కడే తెచ్చినట్టు దొరల గడికి చెప్పులు మోస్తున్న బాల్క సుమన్ ముందు నిజమైన ఉద్యమకారులు 1200 మంది ప్రాణాలర్పిస్తే కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు హరీష్ రావు కవిత కేటీఆర్ జోగినిపల్లి సంతోష్ తదితరులను ఉద్యమకారుల హోదాలో అధికారం కట్టబెట్టి తెలంగాణ ప్రజల సొత్తును దోచుకున్న దొంగలు కారా అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్ష పేపర్లు కూడా అమ్ముకున్న దరిద్రులు టిఆర్ఎస్ నాయకులు కాదా అని ఘాటుగా విమర్శించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టి పేపర్ లీకేజీ చేసిన ఘనులు కేటీఆర్ కవిత అని అన్నారు. ప్రజలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరికి కలవకుండా నిత్యం ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే బావ బామ్మర్దులు హరీష్ రావు కేటీఆర్ లు తమ అక్కసు ప్రభుత్వంపై వెల్లబోసుకుంటున్నారని అన్నారు. బావబామ్మర్దులకు సిగ్గు లజ్జ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై నిత్యం తప్పుడు ప్రచారం చేయడమే వీరి పని అయిందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ధర్నా చౌక్ ను ఎత్తివేసిన ఉన్మాది కేసీఆర్ అని అన్నారు. ఇది బాల్క సుమన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బాల్క సుమన్ తెలంగాణలో బయటికి వస్తే బట్టలు ఊడదీసి కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజలకు, ఉద్యోగులకు, కర్షకులకు కార్మికులకు అందరికీ స్వేచ్ఛ లభించిందన్నారు. దొరల గడికి ఊడిగం చేస్తూ వారు పెట్టిన ఎంగిలి కూడు తిని అడ్డంగా బలిసిన బాల్క సుమన్ ఒకసారి తన మొఖం అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. బాల్క సుమన్ ను తెలంగాణలో తరిమికొడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణకు ఒకటవ తారీకు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వంలో ప్రజాయుద్ధం ఒక గద్దర్ ఆనాటి ప్రగతి భవన్ (దొరల గడి) ముందు మూడు గంటలు పాటు నిరీక్షించిన దొర అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వలేదు తెలంగాణ యుద్ధనౌక గద్దర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అలాంటి యుద్ధ నౌకకి జరిగిన అవమానాన్ని కనపడలేద బాడ్కో సుమన్ దళితుడివి కాదు దళితుడివి గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల సంకనాకిన బాల్క సుమన్ జర భద్రంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెగడ బిక్షపతి, గాండ్ల సురేష్, ఉస్మాన్ అలీ, లాల్ సింగ్ నాయక్, పీరెల్లి భద్రం, వినయ్, జయ ప్రకాష్, సాయి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you