తెలంగాణవీణ,సినిమా : సూర్య చంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ సూర్యచంద్ర మెడల్ అవార్డు కు ఎంపికైన మూసా అలీఖాన్ మిర్యాలగూడ. సినిమా రంగంలో సామాజిక రంగంలో పేద కళాకారులకు తన వంతు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్న మూసా అలీఖాన్ కు సూర్య చంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ వారు మెడల్ తో సన్మానిస్తున్నారు. రక్తదాన శిబిరాలు వాటితో పాటు సేవా కార్యక్రమాలు మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి మూసా అలీఖాన్ మిర్యాలగూడ. సినిమా నటులు, రాజకీయ నాయకులు పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర అవార్డు అందుకోబోతున్నమూసా అలీఖాన్ కు పలువురు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ మధుసూదన్ మల్కాజ్గిరి రిటైర్డ్ జడ్జ్, ఎల్ ఎన్ చిల్ల రాజశేఖర్ రెడ్డి, కళా రత్న డాక్టర్ కే విజయ మోహన్ సినిమా నటులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని మోహన్ చంద్ర జర్నలిస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ ఈ అవార్డు మెడల్ రావడం తనకి ఇంకా బాధ్యత పెరిగిందని తను చేసే సమాజ కార్యక్రమాలు పేద కళాకారులకు చేస్తున్న సేవలు ఇంకా ఎక్కువ శ్రద్ధతో చేసి మున్ముందు అందరి మన్ననలు పొందుతామని ఈ అవార్డు ప్రకటించినందుకు మోహన్ చంద్ర జర్నలిస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు.