తెలంగాణవీణ, హైదరాబాద్ : సిద్ధార్థ నగర్ సీనియర్ సిటిజన్ హాల్, దమ్మాయిగూడలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షులు దండంరాజ్ రాంచందర్ రావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బుపెల్లి బానయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ “ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్”కన్వీనర్ పి.కె.సింగ్ రాథోర్ పిలుపు మేరకు కోల్ కత్తా లోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం,కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ కంపెనీ హెడ్ ఆఫీస్ ముందు కోల్ పెన్షనర్ల ప్రధాన సమస్యలైన కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్-1998 పథకం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్షించి,సవరించి కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచాలని,ఉద్యోగులకు, అధికారులకు సీపీఆర్ఎంఎస్(కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికేర్ స్కీం) మెడికల్ కార్డులో ఒకే విధానం అమలు పరుస్తూ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలని,ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశంలోని ముఖ్య నగరాల్లోగల కార్పొరేట్ ఆసుపత్రుల్లో సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డ్ అనుసంధానం చేయాలని విశ్రాంత ఉద్యోగులకు స్వంత ఇంటి నిర్మాణం కొరకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని. విశ్రాంత ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు,రాష్ట్ర ప్రభుత్వ ఆసరా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలనే సమస్యల పరిష్కారానికై 2024 జనవరి 22 సోమవారం ఉదయం11 గంటలకు జరిగే ధర్నాలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో కొత్తగూడెం కు తరలి రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె.బీరయ్య,సంయుక్త కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు,గీస కనకయ్య,ముఖ్య సలహాదారులు టి.ఉమాకర్,ఎస్.లక్ష్మీ నారాయణ,రాజ నర్సు,జయంత్ కుమార్ ,కొమ్ము సమ్మయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.ఆళవందార్ వేణు మాధవ్,ఉప ప్రధాన కార్యదర్శి,సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ దమ్మాయిగూడ, హైద్రాబాద్.