రిలే నిరాహారదీక్షలు దీక్షను జయప్రదం చేయండి-జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి
తెలంగాణ వీణ,ములుగు: మంగళవారం నాడు వెంకటాపురం ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ ఆవరణంలో జీఎస్పీ అత్యవసర సమావేశం జి ఎస్ పి ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిఎస్టి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ. ఐదవ షెడ్యూల్ భూభాగమంత కలిపి ఆదివాసులకు ప్రత్యేకమైన స్వయంపాలన ఏర్పాటు చేయాలని 22-1-2024 నా భద్రాచలం ఐటీడీఏ ఎదుట ఒక్కరోజు దీక్షను విజయవంతం చేయాలని ఆదివాసి సమాజానిమి పిలుపునిచ్చారు,ఐదవ షెడ్యూల్ ప్రకారంగా ఆదివాసుల పార్లమెంటు చట్టాలను అమలు చేయాలని వలస గిరిజనేతరులను మైదాన ప్రాంతానికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు ,వలస గిరిజనేతరుల వలన ఆదివాసీల అశిత్వం దెబ్బతింటుందని ఏజెన్సీ ప్రాంతంలోకి వలస గిరిజనేతర్లు దౌర్జన్యంగా వచ్చి ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా క్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరు ఎట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆదివాసులకు ప్రత్యేకంగా స్వయంపాలన ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు,ఐక్యరాజ్యసమితి చెబుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై చవితి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆయన అన్నారు,ఒక్కరోజు దీక్షకు ముఖ్య అతిథులుగా శ్రీ సోంది వీరయ్య హాజరవుతారని తెలిపారు,ఈ సమావేశంలో జిఎస్పి ములుగు జిల్లా నాయకులు రేగ గణేష్ కనితి వెంకటకృష్ణ,మట్టి రమేష్ చింత మోహన్ తదితరులు పాల్గొన్నారు.