- జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం: మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. బుధవారం పాత పాల్వంచలోని ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ అకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు మనబడి పనులను పరిశీలించారు. పనులు నత్త నడకన జరుగుతున్నాయని వేగవంతం చేయాలని పర్యవేక్షణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాల, అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రం చేపించాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి, పంచాయతి రాజ్ డీఈ వెంకటేశ్వరరావు, సిడిపిఓ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.