తెలంగాణ వీణ, ఉప్పల్: ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామం, మరిపల్లి గూడా ఘట్కేసర్ మున్సిపల్ ఎన్ ఎఫ్ సి నగర్ లో స్వామి వివేకానంద 161వ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి* మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ సర్పంచ్ కావేరి మచ్చందర్ రెడ్డి తో కలిసి పాల్గొని కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగితే విజయాలు సొంత మవుతాయని.లక్ష సాధనలో స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో నడవడానికి స్వామీజీ చేసిన బోధనలు యువత పాటించాలని కోరారు లక్ష సాధనలో యువత విఫలమైతే లక్ష్యం సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలన్నారు యువత ఆదర్శవంతమైన సమాజం ఏర్పాటు కొరకు నడుం బిగించాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాయ నరేష్,మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి,సినీ సర్టిఫికేషన్ నెంబర్ మైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి,నాయకులు మచ్చేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి,వెంకటేష్ గౌడ్, మహేష్,భాను యాదవ్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు