తెలంగాణవీణ, ఏలూరు : ఏలూరు జిల్లా బిజెపి కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాగం శివ అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా యువ మోర్చా అధ్యక్షులు అదపాక నాగ సురేష్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలుకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షులు యట్రించి ముఖేష్, ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్, సోషల్ మీడియా శివ, మహేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు.