తెలంగాణ వీణ, ఏలూరు కార్పొరేషన్ : ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివేకానందుడికి నివాళులర్పించి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ పాల్గొన్నారు. యువతను మోసం చేసి జాబ్ క్యాలెండరు నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వంపై వినూత్నంగా ఏలూరు బస్టాండ్ లో అర్ధ నగ్న ప్రదర్శన, బిక్షాటన కార్యక్రమం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నత్తా నాగేంద్రబాబు, పోలవరం నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గన్ని సురేంద్ర చౌదరి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గద్దె రఘుబాబు, ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి నల్లూరు గోపికృష్ణ, ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి బొకేనాల వాసు, చింతలపూడి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గంటా శీను, రాష్ట్ర బీసీ సాధికారిక కమిటీ సభ్యులు షేక్ సుభాని, బొబ్బర రాజు, పోలవరం నియోజవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఉప్పాడి వెంకట్రావు, పరిమి సాయి, కలపాల మూర్తి, తెలుగు యువత నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినారు.
ఏలూరు టిడిపి కార్యాలయంలో వివేకానంద వేడుకలు…
