తెలంగాణవీణ, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లంగ్స్‌లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసుత్తం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్‌కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు