తెలంగాణ వీణ,దుండిగల్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సూరారం జ్యోతి డైరీ పాల కంపెనీ రోడ్ ప్రక్కన ఒక యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి దుండిగల్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్న సేకరిస్తున్నారు.సూరారం బహదూర్ పల్లి రహదారి పక్కన పడి ఉన్న మృతదేహం తలకు బలమైన గాయం ఉండడంతో గుర్తుతెలియని వాహనము అతన్ని ఢీ కొట్టిందా లేక ఎవరైనా కొట్టి చంపారా అనే కోణంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.