తెలంగాణవీణ ,సినిమా : యాంకర్ కమ్ నటి అనసూయపై నెట్టింట పై ట్రోలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక అంశం తో అమ్మడు ట్రోలింగ్ గురవుతుంటుంది. ప్రతిగా వాళ్లపై అనసూయ ఎటాకింగ్ కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకూ ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేయడం…మళ్లీ నెట్టింట వైపు చూసేది లేదని సీరియస్ అనేయడం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ యాక్టివేట్ అవ్వడం అన్నది చోటు చేసుకుంటుంది. ఇదంతా అనసూయ కెరీర్ లో నిత్యకృత్యంగా మారిపోయిన అంశం. తాజాగా అమ్మడిపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించింది. ఇన్ స్టాలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బధులిస్తూ.. `ట్రోలర్స్ అంటే వికారమైన జీవులు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిని తెలుసుకున్నా. వాళ్లతో అనవసరంగా సమయాన్ని వృద్ధా చేసుకోవాలనుకోవడం లేదు` అని అంది. అలాగే బుల్లి తెరకు దూరమవ్వడంపైనా అమ్మడు తొలిసారి స్పందించింది.