- పంతంగి టోల్‌ప్లాజా వద్ద నిలిచిపోయిన వందలాది వాహనాలు
- 10 గేట్లు తెరిచి వాహనాలను పంపిస్తున్న అధికారులు
- నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్ రోడ్లు
తెలంగాణవీణ, రాష్ట్రీయం: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఘనంగా జరుపుకునే సంకాంత్రి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు వెళ్తున్న వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. వందలాది వాహనాలు ఒకేసారి రోడ్డెక్కడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులుతీరాయి. అయితే, 95శాతం వాహనాలకు ఫాస్టాగ్ పూర్తికావడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాల కదలికలో వేగం పుంజుకుంది. మరోవైపు, ట్రాఫిక్‌ను వీలైనంత వేగంగా క్లియర్ చేసేందుకు టోల్‌ప్లాజాలోని 10 గేట్లను ఎత్తారు.