తెలంగాణవీణ,సిద్దిపేట : తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది.