ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందని మండిపాటు
తెలంగాణవీణ,హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని… 420 హామీలని ఎద్దేవా చేశారు. హమీలను నెరవేర్చలేక… అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంపై ఈరో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.